
పర్సనల్ లైఫ్‌ను ప్రొఫెషనల్ లైఫ్‌తో అస్సలు పోల్చరు నటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా. రాజకీయాల్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో పాటు గడపాల్సిన సమయాన్ని వాళ్ల కోసం ఇచ్చేస్తారు. దేని టైమ్ దానిదే అంటారు. కుటుంబంలో జరిగిన ఏ చిన్న వేడుకకైనా రోజా హాజరవుతారు. స్వయంగా వంటలు చేసి భర్త, పిల్లలకి వడ్డిస్తారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. కుటుంబంతో కలిసి విదేశాలకు షికార్లకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.
ఇక జూన్ 27న కొడుకు కౌశిక్ బర్త్‌డేని హార్స్లీ హిల్స్ లోగ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు రోజా. భర్త సెల్వమణి, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకుతో రోజా డాన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతో ప్రేమికుడు సినిమాలోని ‘ఊర్వసి’పాటకు కొడుకుతో కాలు కదిపారు రోజా. పాటకు తగినట్లుగా సింపుల్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు. ఎంతైనా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కదా.. ఆ మాత్రం డ్యాన్స్ చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.