Varun Tej: నా జుట్టుకు ఏం అయింది.. మెగా హీరో ఆసక్తికర పోస్ట్

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన ‘గద్దలకొండ గణేశ్’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’అనే సినిమాల్లో నటిస్తున్నారు.
షూటింగ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండే ఈ యంగ్ హీరో.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి ఇలా వచ్చి అలా వెళ్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే కానీ ఆయన పోస్టులు పెట్టడు. ఇక ఆయన రేర్‌గా పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అరే.. నా జుట్టుకు ఏం అయింది’అంటూ వరుణ్ ఓ ఓల్డ్ ఫోటోని షేర్ చేశాడు. అందులో వరుణ్ హెయిర్ స్టైయిల్ ఢిపరెంట్‌గా ఉంది. జుట్టంతా ముళ్లులుగా పైకి లేచి స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలైతే వరుణ్ న్యూ లుక్‌కి ఫిదా అవుతున్నారు.
సంబంధిత వార్తలు