రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్‌.. పెళ్లి కార్డు వైరల్‌

Actor Sumanth Second Marriage With Pavithra, Wedding Card Goes Viral - Sakshi

అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్‌ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారట. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట. వెడ్డింగ్‌ కార్డులు కూడా పంచి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ పెళ్లి కార్డులను SP(సుమంత్‌-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్‌ చేస్తూ తీర్చిదిద్దారు. సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

కాగా, సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు.


ఇక సినిమా విషయాలకొస్తే.. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సుమంత్‌.. హీరోయిజం, మాస్‌ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్‌’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం ‘మళ్లీరావా’ సినిమాతో సుమంత్‌ పాజిటివ్‌ టాక్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘అనగనగా ఒక రౌడీ’లోచిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top