Actor Sharon Stone Says She Lost Son Custody Because of This Reason, Deets Inside - Sakshi
Sakshi News home page

Sharon Stone: 'నీ తల్లి శృంగార సినిమాలు చేస్తుంది' అని కోర్టులో నా కొడుక్కి చెప్పారు

Mar 12 2023 4:08 PM | Updated on Mar 12 2023 6:09 PM

Actor Sharon Stone Says She Lost Son Custody Because of This Reason - Sakshi

పిల్లాడి దగ్గరకు వెళ్లి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మ శృంగార చిత్రాల్లో నటిస్తుంది. నీకు ఆ విషయం తెలుసా?

తాను చేసిన ఓ సినిమా వల్ల కొడుకు దూరమయ్యాడంటూ విచారం వ్యక్తం చేసింది హాలీవుడ్‌ నటి షరాన్‌ స్టోన్‌. 1992లో వచ్చిన బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ సినిమాలో కొద్ది క్షణాల పాటు ఒంటి మీద దుస్తులు లేకుండా నటించింది షరాన్‌. దీనివల్ల ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ ఒక్క సన్నివేశం వల్ల తన కొడుకు తనకు కాకుండా పోయాడంటోంది. 'టేబుల్‌ ఫర్‌ టూ విత్‌ బ్రూస్‌ బాజీ' పాడ్‌క్యాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది నటి.

'2000వ సంవత్సరంలో ఓ పిల్లవాడిని నేను దత్తత తీసుకున్నాను. 2004లో నా భర్త ఫిల్‌ బ్రాన్‌స్టేన్‌తో విడిపోయేటప్పుడు పిల్లాడు నాకు కావాలన్నాను. అప్పుడు ఓ న్యాయవాది నా గారాల బాబు దగ్గరకు వెళ్లి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మ శృంగార చిత్రాల్లో నటిస్తుంది. నీకు ఆ విషయం తెలుసా? అని అడిగాడు. పదహారు సెకండ్ల వీడియోతో నా క్యారెక్టర్‌నే తప్పు పట్టారు. అలా నా దగ్గర పెరగాల్సిన నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఇది నన్ను మానసికంగా కుంగదీసింది. నా గుండె పగిలినంత పనైంది. ఈ వేదనతో నిజంగానే గుండె సమస్యలతో ఆస్పత్రిపాలయ్యాను. 

అసలు ఆ సన్నివేశం డైరెక్టర్‌ నన్ను సంప్రదించకుండా నేరుగా సినిమాలో పెట్టేశాడు. అయినా టీవీలో ఒంటి మీద దుస్తులు లేకుండా చాలామంది కనిపిస్తున్నారు. కానీ వాళ్లను ఎవరూ ఏమీ అనరు. సినిమాలో కాసేపు ఒంటి మీద బట్టల్లేకుండా కనిపించినందుకు నాకు పిల్లాడినే దూరం చేశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల కార్యక్రమంలో నా పేరు పిలవగానే చాలామంది నవ్వుకున్నారు. అది చూసి ఎంతో బాధేసింది. ఎంతో అవమానకరంగా అనిపించింది. కానీ అలాంటి సన్నివేశంలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలి తెలుసా?' అని చెప్పుకొచ్చింది నటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement