అమ్మ ఆశీర్వాదంవల్లే హీరో అయ్యాను 

Actor Naresh Talks In His Birthday Celebrations - Sakshi

‘‘సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మంత్రి కేటీఆర్‌గారి సహకారంతో అతి తక్కువ ధరకు షూటింగ్స్‌కు లొకేషన్స్‌ ఇచ్చి సినిమా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాడనికి మా ప్రభుత్వం రెడీగా ఉంది’’ అని మంత్రి జి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నటుడు, ‘మా’ అధ్యక్షుడు డా. నరేశ్‌ వీకే పుట్టినరోజు వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ‘న్యూ మంక్స్‌ కుంగ్‌ఫూ’ అసోసియేషన్‌ను తెలంగాణలో ప్రారంభించారు. దీనికి నరేశ్‌ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 2021కిగాను 9వ ‘యాన్యువల్‌ బుద్ధ బోధి ధర్మ’ అవార్డ్స్‌ని సినీ నటీనటులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా అందజేశారు.

నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘1979లో నేను కుంగ్‌ఫూ నేర్చుకున్నాను. మా అమ్మ విజయ నిర్మలగారీ ఆశీర్వాదం, మా గురువు జంధ్యాల, ఈవీవీగార్ల ప్రోత్సాహంతో ‘ప్రేమ సంకెళ్లు, నాలుగు స్థంబాలాట’ నుండి వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించాను. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో యస్వీ రంగారావుగారి స్ఫూర్తితో 150 చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలు చేశాను’’ అన్నారు. డా. యం.యన్‌. రవికుమార్, శ్యామ్‌ సుందర్‌ గౌడ్, కోడి శ్రీనివాసులు, కృష్ణకుమార్‌ రాజు, 9వ యాన్యువల్‌ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్‌ గ్రహీతలు ఇంద్రగంటి మోహనకృష్ణ, అలీ, రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top