Actor Naresh And Pavitra Lokesh Visits Mahabaleshwar Temple Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Naresh: మహా కాళేశ్వర ఆలయం నేపథ్యంలో.. 

May 9 2022 8:22 AM | Updated on May 9 2022 10:22 AM

Actor Naresh And Pavitra Lokesh Visits Mahabaleshwar Temple - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం మహా కాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీకే నరేష్, పవిత్రా లోకేశ్, దేవాలయ ధర్మకర్త పట్టపాగులవెంకట్రావు, ఎం.సి. వాసు నటిస్తున్నారు. నటి పవిత్ర లోకేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీకే నరేష్‌ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియోస్‌పై ఈ సినిమా రూపొందుతోంది.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. నటుడు వీకే నరేష్‌ మాట్లాడుతూ–‘‘ఉత్తర భారతంలో ఉజ్జయిని దేవాలయాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతంలో రాజమండ్రి గోదావరి తీరాన పట్టపాగుల వెంకట్రావుగారి ఆధ్వర్యంలో మహా కాళేశ్వర ఆలయం నిర్మించారు’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement