Lawrence: లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్‌

Actor, Director Raghava Lawrence Gets Honorary Doctorate For Social Service - Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్‌ వరించింది. సినీ గ్రూప్‌ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్‌ ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అంటూ అంచలంచెలుగా ఎదిగారు. అయితే ఈయనలో సేవాభావం అనే మరో మానవతా కోణం కూడా ఉంది. ఎందరో అనాథలను వికలాంగులను చేరదీస్తూ వారికి కొండంత అండగా ఉండటంతో పాటు వారికోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.

చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి

అదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. రుద్రన్‌ చిత్ర షూటింగ్‌లో ఉన్న లారెన్స్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.  

చదవండి: వైరల్‌.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్‌ స్టార్స్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top