Actor Devraj Son Pranam Devraj's Vairam Movie is all set to release - Sakshi
Sakshi News home page

Pranam Devraj : హీరోగా లాంచ్‌ అయిన నటుడు దేవరాజ్‌ కొడుకు.. రిలీజ్‌కు రెడీ

Mar 3 2023 4:45 PM | Updated on Mar 3 2023 5:39 PM

Actor Devraj Son Pranam Devraj Starrer Vairam Movie All Set To Release - Sakshi

రామ్.! జై శ్రీరామ్.! ఈ మాట సినిమాల సక్సెస్ మంత్రం అయిపోయింది. ఔను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి అందులో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తే, దాన్ని శ్రీరాముడి పాత్రగా నార్త్ ఆడియన్స్ తీసుకున్నారు మరి. చాలా సినిమాలు ‘జై శ్రీరామ్’ సెంటిమెంట్‌తో ఇటీవలి కాలంలో మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా ‘రామ్’ అంటూ ‘వైరం’ సినిమా తొలి పోస్టర్‌ని  వదిలారు.

ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వైరం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సాయి శివన్ జంపన దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనుంది ‘వైరం’ టీమ్. కాగా, నెంబర్ ప్లేట్ మీదున్న ‘నంబర్’ ఒకింత ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది.

కారణమేంటంటే, ఆ నెంబర్స్ ‘రామ్’ని తలపిస్తుండడం. హిందీలో ‘ర’ అక్షరాన్ని నెంబర్ ‘2’గా చూపిస్తూ, రెండు ‘1’ నెంబర్లను పేర్కొంటూ, ‘4’ నెంబర్‌ని ‘మ’ అక్షరాన్ని పోలి వుండేలా ప్రస్తావించారు. పోస్టర్‌లోని ఈ అంశం సంచలనంగా మారే అవకాశం వుంది. ఈ చిత్రానికి జె.మల్లికార్జున నిర్మాత కాగా, సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. మహతీ స్వర సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement