రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్‌ | Actor Darshan Sensational Comments In Bellary Jail, Seeks Shift Him To Bangalore Jail | Sakshi
Sakshi News home page

రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్‌

Oct 5 2024 1:40 PM | Updated on Oct 5 2024 3:18 PM

Actor Darshan Sensational Comments In Bellary Jail

కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్‌, పవిత్రగౌడ సుమారు ఐదు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి   దర్శన్‌ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, గత కొద్దిరోజులుగా జైల్లో దర్శన్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బళ్లారి జైలులో దర్శన్‌ పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సరైన నిద్రలేకుండా ఆయన ఉన్నారట. ఈ క్రమంలో తనను రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్‌ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొస్తున్నారట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెబుతూ.. తనను బెంగుళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్‌ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు

దర్శన్‌ బెయిల్‌పిటిషన్‌ విచారణ తాజాగా మళ్లీ వాయిదాపడింది. బెంగళూరు నగర 57వ సీసీహెచ్‌ కోర్టులో బెయిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దర్శన్‌ తరఫున న్యాయవాది నాగేశ్‌ వాదనలు వినిపించారు. అయితే,  విచారణను శనివారం నాటికి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నేడు సాయింత్రం విచారణ జరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement