
కన్నడ హీరో దర్శన్ జైలులో ఉండగానే ఆయన నటించిన సినిమా విడుదల కానుంది. రేణుకాస్వామి హత్య కేసులో జైలుకెళ్లిన దర్శన్..బెయిల్‌పై బయటకొచ్చినప్పటికీ సుప్రీం కోర్టు ఎంట్రీతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. అయితే, దర్శన్ నటించిన కొత్త సినిమా 'డెవిల్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక పాటను తాజాగా విడుదల చేశారు. దీనిని సింగర్స్ కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో దర్శన్‌కు జోడీగా రచన రాయ్ నటించింది. దర్శకుడు ప్రకాష్ వీర్ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్ టైమ్‌లో ఆయన బెయిల్ నుంచి బయటకు రావచ్చని సమాచారం.