Actor Bhanu Chander Shocking Comments On Chandrababu Naidu | చంద్రబాబుకు పుట్టగతులుండవు: భానుచందర్ - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పుట్టగతులుండవు: భానుచందర్‌

Jan 5 2021 4:01 PM | Updated on Jan 5 2021 8:48 PM

Actor Bhanu Chander Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచమని సినీ నటుడు భానుచందర్‌ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం దారుణం. చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్‌ ఆనాడే స్ఫష్టంగా చెప్పారు. ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తే చంద్రబాబుకు పుట్టగతులుండవు. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్‌ పాలనలోనే అర్థమైంది’) 

వైఎస్‌ జగన్‌ సంక్షేమపథకాలతో ప్రజలకి దగ్గర కావడం సహించలేకపోతున్నారు. అందుకే ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్లు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగన్‌ కొనసాగుతారు' అని సినీ నటుడు భానుచందర్‌ పేర్కొన్నారు.  చదవండి: (టీడీపీ దుర్మార్గంగా మాట్లాడుతోంది: మల్లాది విష్ణు)

Advertisement
 
Advertisement
Advertisement