సింగరేణి బొగ్గు గనుల్లో ‘ఆచార్య’ షూటింగ్‌ | Acharya Movie Shooting Started In Kothagudem Yellandu Opencast | Sakshi
Sakshi News home page

సింగరేణి బొగ్గు గనుల్లో ‘ఆచార్య’ షూటింగ్‌

Mar 7 2021 5:08 PM | Updated on Mar 7 2021 6:07 PM

Acharya Movie Shooting Started In Kothagudem Yellandu Opencast - Sakshi

తాజాగా జేకే5 ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి ఉపరితల గనిలోకి దిగి, బ్లాస్టింగ్ పని జరుగుతున్న ఏరియాలు, సినిమాకు అనువైన లొకేషన్లను ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులతో కలిసి లొకేషన్లను చూశారు.

కొత్తగూడెం: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ చిత్రీకరణ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమైంది. దీంతో చిత్ర బృందం ఇల్లందుకు చేరుకుంది. ఆదివారం ఉదయం ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ కోసం మూవీ యూనిట్ ఉపరితల గనిలోకి దిగింది. ఇప్పటికే పలుమార్లు జేకే5 ఉపరితల గని, అండర్ గ్రౌండ్ మైన్స్‌ను తన సాంకేతిక చిత్ర బృందంతో దర్శకుడు కొరటాల శివ పరిశీలించారు. తాజాగా జేకే5 ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి ఉపరితల గనిలోకి దిగి, బ్లాస్టింగ్ పని జరుగుతున్న ఏరియాలు, సినిమాకు అనువైన లొకేషన్లను ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులతో కలిసి లొకేషన్లను చూశారు.

ప్రస్తుతానికి హీరో లేకుండా ఉన్న కొన్ని సన్నివేషాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగే షూటింగ్‌లో హీరో చిరంజీవి పాల్గొంటారా? లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ‘ఆచార్య’ మూవీ చిత్రీకరణ మార్చి 15వరకు ఇల్లందులో జరగనుంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ స్పాట్‌లో అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గత నెలలో ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల్లో సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిసిన విషయం తెలిసిందే.

చదవండి:  Acharya: మారేడుమిల్లి ఫారెస్ట్‌లో చిరు, చెర్రీ
చదవండి: చిరంజీవికి ఆతిథ్యం ఇస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement