ఆ స్టార్‌ కపుల్‌పై విడాకుల రూమర్స్.. ఆ పోస్టే కారణమా? | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. ఆ పోస్ట్‌తో మొదలైన చర్చ!

Published Tue, Jan 30 2024 3:44 PM

Abhishek shares cryptic post amid divorce rumours with Aishwarya Rai - Sakshi

సినీ తారలపై రూమర్స్ ఎక్కువగా వింటుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా రోజుల్లో అవీ కాస్తా ఎక్కువగానే వస్తున్నాయనే చెప్పాలి. లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో అయితే ఇలాంటివీ మరీ ఎక్కువే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌పై విడాకులు తీసుకుంటున్నట్లు తెగ చర్చ నడుస్తోంది. ఇటీవల అభిషేక్ చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అభిషేక్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. “విఫలమవుతుందనే భయం మీ కలలను నాశనం చేస్తుంది. ఫెయిల్యూర్‌ నుంచి నేర్చుకుంటే మీ కలలను నిర్మిస్తుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? అన్న చర్చ మరోసారి మొదలైంది. అయితే గతంలోనూ ఈ జంటపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. 

(ఇది చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?)
 
విడాకుల రూమర్స్ 

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీలస ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్‌కు ఐశ్వర్య మాత్రమే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వా బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో రూమర్స్‌కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్.. పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ వైరలయ్యాయి.

అయితే తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫెయిల్యూర్‌పై పోస్ట్ పెట్టడమేనని తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారానే విడాకులకు హింట్ ఇచ్చారని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అభిషేక్, ఐశ్వర్య ఎవరూ స్పందించలేదు. 

ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెప్పించింది. మరోవైపు చిరంజీవి విశ్వంభరలో నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా.. అభిషేక్ బచ్చన్ సైతం ఇటీవలే గూమర్ చిత్రంతో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
 

Advertisement
 
Advertisement