అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి | Sakshi
Sakshi News home page

అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి

Published Thu, Oct 19 2023 4:29 AM

Abhishek Agarwal talks about Tiger Nageswara Rao press meet - Sakshi

రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఇందులో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరో యిన్లుగా నటించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పిన విశేషాలు. 

► మంచి కంటెంట్, కొత్త కథలను చెప్పడమే మా అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పవర్‌ఫుల్‌ కంటెంట్‌ ఉన్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చేశాం. ఈ సినిమా చేయడానికి ముందే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. టైగర్‌ నాగేశ్వరరావు దొంగగా మార డానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి? ఆయన దొంగగా మారిన తర్వాత ఏం చేశారు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి.

► రవితేజగారు హార్డ్‌వర్క్‌ చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లన్నీ ఆయనే చేశారు. ఓ రోజు ఆయన చేతికి గాయమైంది. లొకేషన్‌లో ఐదారు వందలమంది ఉన్నారు. ్ర΄÷డక్షన్‌ కాస్ట్‌ వృథా కాకూడదని, ఆయనకు ఇబ్బందిగా ఉన్నా షూటింగ్‌లో ΄ాల్గొన్నారు. ఇక అనుపమ్‌ ఖేర్‌గారు నా లక్కీ చార్మ్‌ అనే చె΄్పాలి. ఫలానా ΄ాత్ర చేయాలని అనుపమ్‌గారిని కోరితే వెంటనే ఓకే అంటారు. నాపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. హేమలతా లవణంగా రేణూ దేశాయ్‌ బాగా నటించారు. రేణూదేశాయ్‌ 2.ఓ చూస్తారు. ప్రత్యేక శ్రద్ధతో జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించాడు. అవినాష్‌ కొల్లా అద్భుతంగా ఆర్ట్‌ డైరెక్షన్‌ చేశాడు. దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుని పని చేశారు వంశీ. కథకు ఏది అవసరమైతే అది నేను వందశాతం ఇస్తాను. నిర్మాణంలో రాజీపడను. నా కెరీర్‌లో ఓ మంచి గుర్తుగా నిలిచి΄ోతుంది ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

► పండగ అంటే రెండు, మూడు సినిమాలు రావడం సహజం. మా సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నార్త్‌లోనూ మంచి ΄ాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

► తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా నేను అవుట్‌సైడర్‌ని. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు (‘కశ్మీరీ ఫైల్స్‌’ చిత్రం) అందుకోవడం మా సంస్థకు గౌరవాన్ని తెచ్చింది. అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బ్యానర్‌లో త్వరలో ఓ క్రేజీ బయోపిక్‌ ప్రకటిస్తా.

Advertisement
Advertisement