
ఆర్.మాధవన్ నటించిన 'ఆప్ జైసా కోయి' (Aap Jaisa Koi) చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ సోని దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఇందులో హీరోయిన్‌గా ఫాతిమా సనా షేక్ నటించారు.
'ఆప్ జైసా కోయి' సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులో ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల జోడీని ప్రపంచానికి చూపాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దంపతుల మధ్య పదేళ్ల గ్యాప్ ఉంటే ఎలాంటి చిక్కులు రావచ్చు.. వస్తే వాటిని ఎలా పరిష్కరించుకుంటారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.
మహేశ్‌బాబు- రాజమౌళి సినిమా 'SSMB29'లో మాధవన్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లోని ఒక కీలకమైన పాత్రలో నటించాలని ఇప్పటికే మేకర్స్ సంప్రదించారట. కెన్యాలో జరగబోయే షూటింగ్ సెట్స్‌లో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.