బ్యాక్‌ టు వర్క్‌ | A1 Express and vivaha bhojanambu movie Shooting begins | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు వర్క్‌

Sep 1 2020 2:51 AM | Updated on Sep 1 2020 2:51 AM

A1 Express and vivaha bhojanambu movie Shooting begins - Sakshi

కరోనా వల్ల ఇండస్ట్రీలో ఆరు నెలలుగా పని మొత్తం స్తంభించిపోయింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచి నటుడు, నిర్మాత సందీప్‌ కిషన్‌ కూడా పని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇందులో సందీప్‌ కిషన్‌ హాకీ క్రీడాకారుడిగా నటించనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం ముహూర్తం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్‌ అన్నీ పాటిస్తూ ఈ సినిమాల చిత్రీకరణలను జరపనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement