రామాయంపేట(మెదక్): అదిలాబాద్ రైతు గర్జన సభకు తరలివెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపు రామాయంపేట వద్ద ఆగగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ జాతీయ రహదారిపై ఆధ్యా హోటల్‌వద్ద ఆగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు కేటీఆర్‌ను కలువడానికి పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ కేటీఆర్‌ను శాలువాతో సన్మానించారు. పార్టీ మైనారిటీ నాయకుడు అహ్మద్, రమేశ్ ఆయన చేతికి దట్టి కట్టారు. ఈ సందర్బంగా కేటీఆర్ పద్మతోపాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ చరిత, పార్టీ నాయకుడు సుప్రభాతరావు, పార్టీ జిల్లా నాయకులు జీవన్‌రావు, నరేందర్‌తో మాట్లాడారు. ఆయనను సన్మానించడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. మెదక్, రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్లు జితేందర్‌గౌడ్, మల్లిఖార్జున్‌గౌడ్, సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే అదనుగా...
కాగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు నెట్టుకుంటూ ముందుకురాగా, ఇదే అదనుగా దొంగలు తమ హస్త లాఘవం ప్రదర్శించారు. సుమారుగా పది మంది కార్యకర్తలు, జర్నలిస్టుల వద్ద నుంచి రూ.లక్ష వరకు దొంగలు తస్కరించారు. ఒక అనుమానితుడిని పట్టుకున్న కార్యకర్తలు అతడిని కొట్టి పోలీసులకు అప్పగించారు.
రామాయంపేటకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
ఇదే అదనుగా హస్త లాఘవం ప్రదర్శించిన చోరులు


