వివేకానంద విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

వివేకానంద విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

వివేకానంద విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ పంట నష్టపరిహారం చెల్లించాలి ఢిల్లీ ధర్నాలో డీసీసీ అధ్యక్షుడు

రేగోడ్‌(మెదక్‌): మండల కేంద్రమైన రేగోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా ఆదివారం నోబుల్‌ యూత్‌ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని హైస్కూల్‌–పోలీస్‌ స్టేషన్‌ కూడలిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనపై గ్రామ పెద్దలతో చర్చించగా, రోడ్డు పనులు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వారు సానుకూలంగా స్పందించారని ఆ యూత్‌ అధ్యక్షుడు నరేశ్‌చారి తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ శ్యాంరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీలు ఎం.నరేందర్‌, నర్సింహులు, కో ఆప్షన్‌ మాజీ సభ్యుడు చోటుమియా, కాంగ్రెస్‌ యువనాయకుడు రామాగౌడ్‌, చక్రపాణి, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రమైన మెదక్‌ కేవల్‌ కిషన్‌ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియక పంటలు ఎండిపోయాయని చెప్పారు. దీంతో రైతుల పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి రాక నష్టపోయారన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5 నుంచి 8 వరకు కరువు గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, బస్వరాజు, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు బచావో..దేశ్‌ బచావో కార్యక్రమంలో మెదక్‌ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌లు పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు పలువురు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఓటు చోరీ జరగుతుందని ఆరోపించారు. అర్హుల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని వారు డిమాండు చేశారు.

పేట నాయకులు

చిన్నశంకరంపేట(మెదక్‌): ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓటు బచావో...దేశ్‌ బచావో నిరసన కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ ఆధ్వర్యంలో వంద వాహనాలలో ఢిల్లీ వెళ్లిన నాయకులలో చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోహన్‌నాయక్‌, మాజీ ఎంపీటీసీ శివకుమార్‌, రాజ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఓటు హక్కును రక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చివరి వరకు పోరాడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement