జనసంద్రంగా ఏడుపాయల
భక్తులతో కిటకిటలాడుతున్న ఏడుపాయల
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా మమ్ము దీవించమ్మా అంటూ ఆదివారం వేలాది భక్తులు ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, పోతరాజులు ఊరేగింపుతో బోనాలు తీసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో, ఈఓ వీరేశం, పోలీసులు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు పుట్టినరోజు పురస్కరించుకుని, కాంగ్రెస్ కార్యకర్తలు ఏడుపాయల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.


