మెదక్ కలెక్టరేట్: తుపాన్ ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలని, మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపాన్ నేపథ్యంలో మెదక్ జిల్లా అధికారులకు, రైతులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పంటలు చేతికొచ్చిన, కళ్లాల్లో ఉన్న వరిధాన్యాన్ని రక్షించుకునేందుకు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులకు ముందస్తు సమాచారం అందిస్తూ పంటల నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులను ముందుగానే అప్రమత్తం చేసి పంట రక్షణ చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు అందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్


