బాలికలకు అండగా పోలీస్‌ అక్క | - | Sakshi
Sakshi News home page

బాలికలకు అండగా పోలీస్‌ అక్క

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

బాలికలకు అండగా పోలీస్‌ అక్క

పెద్దశంకరంపేట(మెదక్‌): రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, వారికి అండగా నిలిచేందుకు ‘పోలీస్‌ అక్క’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో ఈ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, గృహహింస, సైబర్‌ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి పోలీస్‌ అక్కలను ఆశ్రయిస్తే వెంటనే స్పందించి చట్టపరమైన రక్షణతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. సోషల్‌ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, అపరిచితుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండడం, సైబర్‌ మోసాలపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. మహిళల గౌరవం, భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్బీ ఇన్స్‌పెక్టర్‌ సందీప్‌రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్‌రెడ్డి, శంకర్‌, పోచయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement