మెడికల్‌ కళాశాల ఉన్నా వైద్యం శూన్యం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాల ఉన్నా వైద్యం శూన్యం

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

● జ్వరం, జలుబుకు మాత్రమే చికిత్స ● అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియాకు రెఫర్‌

● జ్వరం, జలుబుకు మాత్రమే చికిత్స ● అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియాకు రెఫర్‌

çÜÐ]l$çÜÅ ¡{Ð]l…V> E…sôæ¯ól Æð‡çœÆŠḥæ

తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటేనే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నాం. ఇక్కడ కార్డియాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌లు లేరు. దీంతో అందుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు వస్తే వారిని రెఫర్‌ చేయాల్సి ఉంటుంది. ఇటీవల రెఫర్‌ చేసిన ఇద్దరు పేషెంట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం.

– వనజ, ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ, మెదక్‌

కొల్చారం మండలం వెంకటాపూర్‌కు చెందిన అంజయ్య ఇటీవల కుటుంబ కలహాలతో విషం తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వెంటనే గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబీకులు నానా అవస్థలు పడి అక్కడికి

తీసుకెళ్లారు. ఇలా ఎలాంటి సమస్యతో సర్కారు దవాఖానకు వచ్చినా ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తుండటంతో సామాన్య ప్రజలు నానా తంటాలు

పడుతున్నారు.

ఈ చిత్రంలోని వృద్ధుడు నరేశ్‌. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామం. ఈనెల 26 (ఆదివారం) ఇంట్లో జారి పడగా కాలు విరిగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు సరైన కారణం చెప్పకుండానే హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకున్నారు.

మెదక్‌జోన్‌: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ పెద్దాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాంటి ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. ప్రాణం మీదికి వచ్చిన రోగులు, అత్యవసర వైద్యం కోసం వస్తే గాంధీకి రెఫర్‌ చేస్తున్నారు. దగ్గు, జ్వరం లాంటి చిన్నపాటి సమస్యలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరై రెండేళ్లు అవుతోంది. పెద్ద చదువులు చదివిన డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు వస్తారని, ఎలాంటి జబ్బు చేసినా స్థానికంగానే చికిత్స అందుతుందని ప్రజలు సంతోష పడ్డారు. కానీ గతంలో లాగే ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయపాలన పాటించని వైద్యులు

మెడికల్‌ కళాశాల వచ్చినప్పటి నుంచి వైద్యులు ఎప్పుడు విధులకు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రారని, మధ్యాహ్నం 2 గంటలు దాటితే అందుబాటులో ఉండరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని రోగు లు వాపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement