ఆరుతడి పంటలే మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలే మేలు

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. సోమవారం కౌడిపల్లిలో వ్యవసాయ అధికారులు టమాట రైతు మహిపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకం, రైతువేదికలో విత్తన మేళా నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్‌నినోతో వర్షాలు తగ్గాయని, వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. కూరగాయల పంటలు సాగుతో మంచి ఆదాయం వస్తుందన్నారు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ దేవ్‌కుమార్‌, ఉద్యానవన అధికారి ప్రతాప్‌సింగ్‌, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, రు ద్రమూర్తి, ఆర్‌డీఓ రామకష్ణ, డీఎల్‌పీఓ సురేశ్‌బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, సర్పంచ్‌ కృష్ణాగౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement