జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్
చిలప్‌చెడ్(నర్సాపూర్): రీసర్వేతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా ల్యాండ్ సర్వే ఏడీ కిషన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాందాస్‌గూడలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించారు. ప్రతి 30 సంవత్సరాలకు ఓ సారి భూ సర్వే జరగాలని, తెలంగాణలో వంద సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు ఎలాంటి భూ గణన జరగలేదన్నారు. సక్రమంగా ఉన్నా భూ యజమానులకే హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం భూముల రీసర్వే చేస్తుందన్నారు. ఆధునిక సాంకేతికతో సర్వే చేసి భూదార్ నంబర్ ఇస్తామన్నారు. జిల్లాలో 75 గ్రామాల్లో భూముల రీసర్వేకు అనుమతి లభించగా, రాందాస్‌గూడలో సుమారు 53 ఎకరాలు, మంగళపల్లిలో 52 ఎకరాల్లో రీ సర్వే చేస్తామన్నారు. గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ రాంరెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ప్రశాంత్, సర్వేయర్ రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మోహన్, రైతులు పాల్గొన్నారు.


