ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్‌

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్‌ 1న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌ ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్‌ కార్డుల జారీ, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈ ఓ మధుసూదన్‌రావు, నాయకులు భద్రయ్య, ఝాన్సి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement