బీజేపీతో వ్యవస్థలు నాశనం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతో వ్యవస్థలు నాశనం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

తూప్రాన్‌: దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన రాహుల్‌గాంధీ సహా ఇతర నేతలను అరెస్టు చేయడాన్ని నిరసనగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్‌ రవీందర్‌గుప్తా, మండలపార్టీ అధ్యక్షుడు మల్లేశ్‌, పట్టణశాఖ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు నాగరాజుగౌడ్‌, విఠల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్‌లోని మరో వర్గం విజయభాస్కర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement