సీఎం రేవంత్‌ రైతు ద్రోహి | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ రైతు ద్రోహి

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్‌ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా సాగునీరు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి రైతుద్రోహిగా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతుపాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతలను మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించి రూ.19 వేల కోట్ల రైతుబంధును ఎగనామం పెట్టారని, కేసీఆర్‌ తెచ్చిన రైతు బీమా పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంపులు ఆన్‌ చేసి రైతుల కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలనకు విసిగిపోయి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement