నారాయణఖేడ్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, సర్ ఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జి మహ్మద్ ఫయీం కోరారు. ఖేడ్ నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బీఎల్‌ఏలకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్ గడువును వచ్చే నెల 3 వరకు పెంచారని తెలిపారు. దీనిని వరంగా భావించి కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఎల్‌ఏలు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అర్హులైన ప్రతీ ఒక్క ఓటరుతో పాటు విద్య, ఉపాధి కోసం ఇతరత ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి వారిచే ఫారాలను నింపించాలని సూచించారు. తమ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఫారాలు నింపి సమర్పించారనే విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలంటూ చెప్పారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


