సాంస్కృతిక వారసత్వం జోడించాలి | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వారసత్వం జోడించాలి

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

ఘనంగా ఐఐటీహెచ్‌ 15వ స్నాతకోత్సవం ‘ఆవిష్కరణలతోనే జాతి నిర్మాణం’ నినాదాన్ని ప్రకటించిన ఐఐటీహెచ్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ విద్యాసంస్థ ఈసారి రికార్డు స్థాయిలో 1,398 మంది బీటెక్‌, ఎంటెక్‌, పరిశోధన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసింది. ‘ఆవిష్కరణలతోనే జాతి నిర్మాణం’అనే సంస్కృత వాక్యాన్ని తమ అధికారిక నినాదంగా ఐఐటీహెచ్‌ ప్రకటించింది. కార్యక్రమంలో ముఖ్యఅథితిగా పాల్గొన్న పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... శాసీ్త్రయ నైపుణ్యాన్ని భారతదేశపు గొప్ప మేథో, సాంస్కృతిక వారసత్వంతో మేళవించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ‘విజ్ఞానశాస్త్రం, కళలు మన భరతమాతకు రెండు కళ్లలాంటివని విజ్ఞానశాస్త్రం మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడితే, కళలు మనిషిలోని దైవత్వాన్ని మేల్కొలుపుతాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత ప్రాచీన జ్ఞానం నుంచి స్ఫూర్తి పొందాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌.బీఎస్‌.మూర్తి, పాలకవర్గం చైర్మన్‌ బీ.వీ.ఆర్‌.మోహన్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఒత్తిడికి గురికావద్దు

విద్యార్థులకు పరీక్షలు..ప్రాజెక్టులు..ఇలా కొంత ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తమ సమస్యను స్నేహితులతో, కుటుంబసభ్యులతో చర్చించాలి. అప్పుడే ఒత్తిడిని జయించి చదువుపై శ్రద్ధ నిలపగలుతాం. ఇక్కడ ఎం.టెక్‌ (ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌) పూర్తయింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలనే లక్ష్యం ఉంది. 10+2 వరకు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోనే చదువుకున్న.

– సిద్దార్థ్‌ అగర్వాల్‌, ఎంటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

ప్రణాళికాబద్ధంగా చదువు సాగాలి

ఐఐటీహెచ్‌లో చదువుకోవడం ఆనందంగా ఉంది. ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చు. ప్లేస్‌మెంట్‌లో ముంబైలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఐటీ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులు కొనసాగిస్తాను. సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోవడం ఆనందంగా ఉంది.

–హరిణి కోవూరి, బీటెక్‌, ఎంఎస్‌ఎంఈ

పద్మవిభూషణ్‌ అవార్డుగ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement