చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట పీఏసీఎస్‌లో నిధుల గోల్‌మాల్‌పై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘స్వాహాకారం’ కథనంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసినట్లు సమాచారం. బ్యాంకు అధికారులతో మాట్లాడి సమాచారం అడిగినట్లు తెలిసింది. అలాగే సీఈఓ రమేశ్‌ను బ్యాంకు స్టేట్‌మెంట్, ఎరువుల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. డబ్బులు వెంటనే బ్యాంకులో జమ చేయాలని, అందుకు సరిపోను ఎరువుల స్టాక్‌ను చూపాలని సీఈఓను ఆదేశించారు. అలాగే డీసీసీబీ మేనేజర్ చంద్రశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ సంగప్ప పీఏసీఎస్ చేరుకొని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని సీఈఓను నిలదీశారు. సోమవారం వరకు అవకాశం ఇచ్చారు. తక్షణమే రూ. లక్ష డిపాజిట్ సైతం చేసినట్లు తెలిసింది. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో వైస్ చైర్మన్ మేడి నగేశ్‌కు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.


