మెదక్ కలెక్టరేట్: ట్రిపుల్‌ఆర్‌లో రైతుల భూములు లాక్కున్న ప్రభుత్వం బాధిత రైతులకు వెంటనే పరిహారం అందించాలని రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాధిత రైతులతో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్, తిర్మలాపూర్ గ్రామాలకు చెందిన రైతుల భూములను 2024లో ట్రిపుల్‌ఆర్ కోసం తీసుకున్నట్లు తెలిపారు. అప్పట్లో పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కుంటిసాకులు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు.


