వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, నిధులు విడుదలలో జాప్యంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రామాయిపల్లి, ఉప్పులింగాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో పంచాయతీల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి పేరిట ప్రతి మూడు నెలలకోసారి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. తద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, తాగునీటి సమస్య లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పావని, శేఖర్, భూపాల్‌రెడ్డి, నాయకులు రమేశ్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, కిష్ణాగౌడ్, గోపాల్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


