ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: రోజురోజుకు కొత్త తరహాలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థలు, లోన్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి గోప్యమైన సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొదన్నారు. ఇటీవలి ఏపీకే ఫైల్స్ పంపించడం, క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేయించడం, నకిలీ లోన్ యాప్‌లు, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఓఎల్‌ఎక్స్ వంటి వేదికల ద్వారా మోసాలు పెరుగుతున్నాయన్నారు. రివార్డు పాయింట్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు కాజేసే ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థిక మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌్‌కు కాల్ చేయాలన్నారు.


