18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ

మెదక్‌జోన్‌: ఈనెల 18న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు సంబంధించి అధికారులు ఇరుపక్షా ల కక్షిదారులతో మాట్లాడి కేసులను రాజీ చేయించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ నీలిమ అన్నారు. లోక్‌అదాలత్‌ కేసులపై శుక్రవారం సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌ కుమార్‌, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయి ప్రభాకర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18న జరుగబోయే ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో అత్యధికంగా కేసులను రాజీ చేసే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు పోచయ్య, శోభన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement