ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన
పెద్దశంకరంపేట(మెదక్): రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణ అన్నారు. మంగళవారం మండల పరిధి కమలాపూర్‌లో రైతులకు ఫార్మర్ రిజిష్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. మండలంలో 16,500 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 45 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారని, మిగతా రైతులు కూడా వెంటనే చేయించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు ఈఐడీ నంబర్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట్ల సుజాత, సెక్రటరీ రాజుగౌడ్, ఏఈఓలు వినీత్, అఖిల్, సుభాష్ తదితరులున్నారు.


