మహిళలకు పెట్రోలు బంకులు
నర్సాపూర్: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా పెట్రోలు బంకులు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన మాట్లాడారు. మహిళా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని చెప్పారు. అవసరమైతే నర్సాపూర్‌లోని మరో మండలంలో సైతం వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీనిచ్చారు. మహిళా సంఘాలకు రూ.3.46కోట్లు, నర్సాపూర్ పట్టణంలో రూ.66.93 లక్షల వడ్డీలేని రుణాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ...మహిళలకు రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే కోటాలో 1,400 ఇందిరమ్మ ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరలో కేటాయించాలన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు పలువురు అధికారులతో కలిసి మహిళ సంఘాల సభ్యులకు చెక్కులు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, ఆర్‌డీఓ మహిపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓట్లు చీలకుండా చూడాలి
క్యాడర్‌కు మంత్రి వివేక్ సూచన
25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్
నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లు చీలకుండా చూడాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం రాత్రి నర్సాపూర్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న ఆంజనేయులుగౌడ్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. రెబెల్స్ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. క్రమశిక్షణ కల్గిన ప్రతి కార్యకర్తకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని ఓటర్లలో నమ్మకం కల్గించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వ్యూహత్మకంగా వ్యవహరించి ఓటర్లను ఆకట్టుకుని తమ వైపు తిప్పుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 25 లేదా 26 న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరి 11 ఎన్నికలు జరుగుతాయని మంత్రి చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేష్, రాజుయాదవ్, చిన్న ఆంజనేయులుగౌడ్, శ్రీధర్‌గుప్తా, వెంకట్రాంరెడ్డి, శ్రీఽనివాస్‌గుప్తా, హబీబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెల్లడి
త్వరలో 1,400 ఇందిరమ్మ ఇళ్లు
మహిళలకు చీరల పంపిణీ


