మూడో చైర్‌పర్సన్ ఎవరో..
మెదక్ మున్సిపల్ చైర్మన్ పదవి ఈ సారి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన మహిళా నాయకులు చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఆశిస్సులు పొందేందుకు ఇప్పటికే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కొంత మంది ఇతర పార్టీలోకి వెళ్లి తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి యత్నాలు ముమ్మరం చేశారు. చివరకు మెదక్ చరిత్రలో మూడో సారి చైర్మన్ పీఠం ఎవరి పరమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట అప్పటి కౌన్సిలర్లు


