పారదర్శకంగా దర్యాప్తు చేయండి
మెదక్ మున్సిపాలిటీ: దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, బాధితులకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యం కావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌న్, గ్రేవ్, నాన్–గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ‘‘అరైవ్ అలైవ్’’కార్యక్రమం ప్రతి మారుమూల గ్రామ ప్రజలకు కార్యక్రమ ఉద్దేశం చేరే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సీఐలు జాన్‌రెడ్డి, రేణుకారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గా కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశం


