తాగునీటి ఎద్దడికి చర్యలు
మెదక్ కలెక్టరేట్: రాబోయే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా వ్యాప్తంగా పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్‌వెల్‌ల పూర్తి వివరాలు సేకరించాలన్నారు. మైనర్ రిపేర్ల కోసం చెక్‌లిస్ట్ తయారు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ బోర్లు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుందన్నారు. 26న నిర్వహించే గణతంత్ర వేడుకలపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కొల్చారం(నర్సాపూర్): ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులను పరీక్షలకు పూర్తి సంసిద్ధులుగా చేయవలసిన అవసరం అధ్యాపకులపై ఉందని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు.
కలెక్టర్ రాహుల్ రాజ్
25న జాతీయ ఓటర్ల దినోత్సవం


