పశువులకు టీకాలు తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్)/చిలప్‌చెడ్: పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్‌లో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాడి రైతులు పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స చేయించి సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు. ఎద లక్షణాలను గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించాలని రైతులకు సూచించారు. లేగ దూడలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో రంగంపేట పశువైద్యాధికారి ప్రియాంక, సర్పంచ్ అంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, జిల్లా గోపాల మిత్ర సూపర్ వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, గోపాల మిత్రులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం చిలప్‌చెడ్ మండలం చిట్కుల్‌లో జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పస్తుతం జీవాలకు (అమ్మతల్లి) అంటు వ్యాధి ఎక్కువగా సోకుతుందన్నారు. దీనికి టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్, పశు వైద్యాధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య


