ఏడుపాయలకు రూ.16.87 లక్షల ఆదాయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల మాఘ అమావాస్యకు రూ.16.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఒడి బియ్యం టికెట్ల ద్వారా రూ. 6,450, కేశఖండనం రూ. 8,850, లడ్డూ ద్వారా రూ. 5,84,620, పులిహోర రూ. 2,76,550, కుంకుమార్చన (రూ. 500 టికెట్) రూ. 2,77,500, కుంకుమార్చన (రూ. 250 టికెట్) రూ.56,750, ప్రత్యేక దర్శనం (రూ. 100 టికెట్) రూ. 3,78,800, ప్రత్యేక దర్శనం (రూ.20) రూ. 83,420, విరాళం రూ. 5,100, సత్రముల రూ.7,900, మొక్కుబడి రూ.1,275 కలిసి మొత్తం రూ.16,87,215 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కాగా గతేడాది రూ.13,13,170 ఆదాయం వచ్చిందని వివరించారు.
‘తపస్’ రాష్ట్ర అదనపు
కార్యదర్శిగా భాస్కర్
నిజాంపేట(మెదక్): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని నస్కల్‌కు చెందిన దుబాసి భాస్కర్ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రకటించారు. తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈసందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చే స్తానని హామీ ఇచ్చారు.
ఏడుపాయలకు రూ.16.87 లక్షల ఆదాయం


