వేడెక్కిన పుర రాజకీయం | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన పుర రాజకీయం

Jan 20 2026 10:17 AM | Updated on Jan 20 2026 10:17 AM

వేడెక్కిన పుర రాజకీయం

వేడెక్కిన పుర రాజకీయం

చర్చలు, సమీక్షలు, సమాలోచనలు

అధిక స్థానాలు

కై వసం చేసుకునే దిశగా అడుగులు

నర్సాపూర్‌ బల్దియాలో

రాజకీయాలు రసవత్తరం

నర్సాపూర్‌: రిజర్వేషన్లు ఖరారు కావడంతో ‘పుర’ రాజకీయాలు వేడెక్కాయి. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి తన నివాసంలో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఆయా వార్డులలో పార్టీ పరిస్థితులు, తదితర అంశా లపై అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్‌ ఇప్పటికే పార్టీ నాయకులు, ఆశావహులతో సమావేశమయ్యారు. పలు వార్డుల్లో సిట్టింగ్‌లకు రిజర్వేషన్‌ అనుకూలంగా రాకపోవడంతో, వారు ఏ వార్డులో పోటీ చేయాలనే అంశాలపై చర్చించారు. ఎంపీ రఘునందన్‌రావు సూచనల మేరకు పోతన్‌శెట్టిపల్లి సర్పంచ్‌ దయాకర్‌గౌడ్‌, హత్నూర మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాజమల్లారెడ్డి, కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాకేశ్‌ సోమవారం నర్సాపూర్‌లో అందుబాటులో ఉంటారని, పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నాయకులు తమ పేర్లు వారి వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు చెందిన ఆశావహులు సైతం తమ పేర్లను పార్టీ సూచించిన నాయకులకు అందచేసినట్లు తెలిసింది. సోమవారం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పార్టీ నాయకులు, ఆశావహులతో సమావేశం అయినట్లు తెలిసింది. కాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ ముఖ్య నాయకులతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

మద్దతు కోరుతున్న పలువురు

ఆయా పార్టీల టికెట్లు ఆశిస్తున్న పలువురు తమ వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు. కుల సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులతో పాటు ప లువురి ఇళ్లకు వెళ్లి పోటీలో ఉంటున్నానని, మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా ఆయా వార్డుల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమకే పార్టీ టికెట్‌ ఇస్తుందనే నమ్మకంతో ప్రచారం మొదలు పెట్టారు. అయితే టికెట్‌ ఎవరికి వస్తుందో వేచి చూడాలి మరి.

నేడు మంత్రి వివేక్‌ రాక

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వివేక్‌ మంగళవారం నర్సాపూర్‌ వస్తున్నారని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ని ర్వహిస్తున్న సన్నాహక సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. పట్టణంలోని పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement