క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
సంగారెడ్డి క్రైమ్: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన సంసద్ ఖేల్ మహోత్సవ్ సోమవారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేల్ మహోత్సవ్ ముఖ్య ఉద్దేశం అని అన్నా రు. గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి స్టేడియం అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా అభివృద్ధి చేస్తానంటూ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. పోటీల్లో వ్యక్తిగత ఓవరాల్ చాంపియన్‌గా బాడ్మింటన్ డబుల్‌లో విశా ల్ నాయక్, శివ దినేష్‌గౌడ్, క్రికెట్‌లో మహివర్దన్ టీం, కబడ్డీలో సంగారెడ్డి అసోసియేషన్, కోకోలో పాపన్నపేట, వాలీబాల్ చాంపియన్‌గా కాసాల గ్రా మం విజేతలుగా నిలిచి ట్రోఫీలు అందుకున్నారు. కార్యక్రమంలో కబడ్డీ జాతీయ కోచ్ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


