గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
మెదక్‌జోన్/పాపన్నపేట/మెదక్ కలెక్టరేట్: గ్రామా ల అభివృద్ధే లక్ష్యం కావాలి, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ నూతన సర్పంచ్‌లకు సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్‌ల పనితీరుతోనే రాష్ట్రంలో గ్రామాలకు గుర్తింపు లభిస్తుందన్నారు. పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదటి రోజు పాపన్నపేట, నార్సింగి, మెదక్ హవేళిఘణాపూర్ మండలాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ రవీందర్, డీపీఓ యాదయ్య, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్లు, డీఎల్‌పీఓలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల వరకు సెల్‌ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. స్పెషల్ క్లాసులకు విధిగా హాజరు కావాలని చెప్పారు. అలాగే గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. మహిళా సంఘాల సభ్యుల తో పాటు ఇతర మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


