ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
¯]lÆ>Þç³NÆŠḥæGÐðl$ÃÌôæÅ çÜ$±™é-Æð‡yìlz
నర్సాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలుకు సా ధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పురపాలక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులను హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శివకుమార్, శేఖర్,అశోక్‌గౌడ్, నయీం, సత్యంగౌడ్, భిక్షపతి, బాల్‌రెడ్డి లక్ష్మణ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.


