కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
రామాయంపేట(మెదక్)/మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు విజ్ఞప్తి చేశారు. శనివారం రామాయంపేటలో మెప్మా గ్రూపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేసి మా ట్లాడారు. మాయ మాటలతో మరోసారి ప్రజలను మోసగించడానికి బీఆర్‌ఎస్ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. రామా యంపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయి ంచామన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డ్వా మా పీడీ హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రాఘవేందర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు రమేశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెదక్‌లో మహిళా సంఘాల సభ్యులకు రూ. 90 లక్షల వడ్డీలేని రుణా లు అందించి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం అన్నా రు. అభివృద్ధి, సంక్షేమంలో మెదక్ దూ సుకెళ్తుందన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమి లేదని విమర్శించారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు


