ఆర్టీసీ ద్వారా మేడారం ప్రసాదం
సిద్దిపేటకమాన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికి పంపిస్తామని ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట ఆర్టీసీ డిపోలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28నుంచి 31వరకు జరగనున్న మేడాకం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళలేని వారికి ప్రసాదాన్ని అందజేయడానికి ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసిందన్నారు. ఆర్టీసీ ఆన్‌లైన్ ద్వారా, పత్య్రేక కౌంటర్ల ద్వారా ఎవరైనా భక్తులు ముందుగా రూ.299 చెల్లించి వారి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్‌తో పాటు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వారు నమోదు చేసుకున్న వారికి మేడారం ప్రసాదం, అమ్మవార్ల ఫోటోతో పాటు పసుపు కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7702160630 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


