పల్లె లోగిళ్లు.. భోగిభాగ్యాలు
●అంబరాన్నంటిన వేడుకలు ●ఎక్కడ చూసినా పండుగ సందడే
●నేడే రంగుల సంక్రాంతి.. సర్వం సిద్ధం
మెదక్‌అర్బన్ : మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు జిల్లాలో అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. బుధవారం భోగిని జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే మహిళలు వాకిట్లో రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గు లో గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో నవధాన్యాలు పోశారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. పాత వస్తువులతో భోగి మంటలు వేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోగా, చిన్నారులు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. కాగా గురువారం మకర సంక్రాంతి, రేపు కనుమను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో లోగిళ్లన్నీ సందడిగా మారాయి.
పల్లె లోగిళ్లు.. భోగిభాగ్యాలు


