చార్మినార్ జోన్‌లో కలపండి
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలపాలని కలెక్టరేట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల జోన్‌లో కలపడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లాను వెంటనే చార్మినార్ జోన్‌లో కలపాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఆయాశాఖల అధికారులు సందీప్, నవీన్‌కుమార్, నవీన్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.


