రైతులకు పరిహారం ఇవ్వండి
మెదక్ కలెక్టరేట్: యాసంగి పంటలకు సింగూరు నీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగమాగం చేస్తుందని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం సింగూరు మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఈ గోస తప్పేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సింగూరు, కృష్ణ జలాలను ఏపీకి అప్పగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఘనపూర్ ఆనకట్ట కింద 40 వేల ఎకరాలకు నీళ్లు అందక రైతు కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకపోవటం విచారకరమన్నారు. రైతుల గోస సీఎంకు తెలిసేలా పోస్ట్‌కార్డు ఉద్యమం చేపడతామన్నారు. కఅనంతరం ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే శశిధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ లావణ్యరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.


